ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రాలయంలో నిర్వహించే సభకు రావాలని ఆహ్పానించామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో తెలియజేస్తానని ఖర్గే హామీ ఇచ్చారు.. రాహుల్ గాంధీ చేసిన “భారత్ జోడో” యాత్ర ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్బంగా మంత్రాలయంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం అని రుద్రరాజు పేర్కొన్నారు. “కుల గణన” పై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు కృతజ్ణతలు తెలిపాను అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Viral Video : ఇదేందయ్యా ఇది.. ఇలా తయారైయ్యారేంట్రా జనాలు..
“కాంగ్రస్ వర్కింగ్ కమిటీ” సమావేశంలో “కుల గణన” పైనే విస్తృతంగా చర్చ జరిగింది అని సీడబ్య్లూసీ సభ్యులు రఘువీరా రెడ్డి అన్నారు. 2011లో యుపీఏ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన “కుల గణన” వివరాలను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. 2013-14లో కర్నాటక సీఎంగా సిద్దరామయ్య ఉన్నప్పుడు నిర్వహించిన “కుల గణన” వివరాలను వచ్చే నవంబర్ లో బహిర్గతం చేయబోతున్నట్లు ఈ రోజు జరిగిన “సీడబ్ల్యుసీ” సమావేశంలో కర్ణాటక సీఎం తెలిపారు అని ఆయన అన్నారు.
Read Also: CM Jagan Review: కృష్ణాజలాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమావేశం
“కుల గణన” వలన సరైన రీతిలో సామాజిక, రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు జరుగుతాయని రఘువీరారెడ్డి అన్నారు. “సమ సమాజ” స్థాపనకు “కుల గణన” దోహదం చేస్తుందనే విశ్వాసం తో ఉన్నాం.. పండిట్ నెహ్రూ నుంచి, ఇందిరా గాందీ, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ “సామాజిక న్యాయం”కు కట్టుబడి ఉంది.. అలాగే, మోడీ ప్రభుత్వం చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై కూడా చర్చించాం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో సహా రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావడం లాంటి అంశాలపై చర్చించామని రఘువీరా రెడ్డి అన్నారు.