Gidugu Rudra Raju: విభజన హామీలు అమలు కావాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఏపీ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చారిత్రక రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.. ఇక, చంద్రబాబు, వైఎస్ జగన్ వాళ్ల స్వార్దం కోసం రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు కావాలి అంటే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్న ఆయన.. ఏపీలో తొమ్మిది గ్యారంటీల హామీతో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. కాంగ్రెస్ సెక్యులరిజం.. బీజేపీ మతతత్వానికి మధ్య పోటీ అన్నారు. మళ్లీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే దేశం తీవ్రంగానష్టపోతుందని హెచ్చరించారు.
Read Also: Intermediate Board: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్
ఇక, వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరు జైలు, బెయిలు మధ్య ఉన్నారని ఎద్దేవా చేశారు గిడుగు రుద్రరాజు.. మరోవైపు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ వద్దకు తిరిగిన వాళ్లు ఇవాళ బీజేపీ అభ్యర్థులు అయ్యారంటూ దుయ్యబట్టారు.. ఏపీలో తొమ్మిది గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని. విభజన హామీలు అమలు కావాలి అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం రావడం ఒక్కటే మార్గంగా చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఏపీ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.