Python in School bus: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో ఆదివారం ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ దూరింది. ఒక మేకను మింగిన కొండచిలువ.. అనంతరం మెల్లగా స్కూల్ బస్సులోకి దూరింది. గమనించిన గ్రామస్తులు పాఠశాల యాజమాన్యానికి విషయాన్ని చెప్పగా.. వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో బస్సులో దూరిన భారీ కొండచిలువను సురక్షితంగా బంధించారు. ఆ బస్సు స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన బస్సును ఓ గ్రామం వద్ద ఆపి ఉంచగా.. ఆ పాము వాహనంలోకి దూరింది.
కొండచిలువను అటవీ శాఖ అధికారులు రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీ శాఖ అధికారులు ఎంతో శ్రమించి బస్సులో దూరిన భారీ కొండచిలువను సురక్షితంగా ఒక గోనె సంచిలో బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
A python rescued from a school bus in Raibareli, UP. pic.twitter.com/1mP3EY9njc
— Piyush Rai (@Benarasiyaa) October 16, 2022