NTV Telugu Site icon

GHMC : 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు

Ghmc

Ghmc

GHMC : 2024-25 ఆర్థిక సంవత్సరంలో, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు అయ్యింది. ఈ ఏడాది 2,038 కోట్లు, 48 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 121 కోట్లు ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో 1,917 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయబడింది. ఈ సంవత్సరంలో 19 లక్షల 50 వేల ఆస్తులున్నా, 14 లక్షల 8 వేల మంది ప్రాపర్టీ ఓనర్స్ తమ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారు.

ప్రత్యేకంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ళు:

అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ లో 530 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలయ్యాయి.

అతి తక్కువగా చార్మినార్ జోన్ లో 150 కోట్లు వసూలు అయ్యాయి.

సర్కిళ్ల వారీగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు:

శేరిలింగంపల్లి సర్కిల్ లో అత్యధికంగా 288 కోట్లు వసూలు అయ్యాయి.

ఫలక్ నామా సర్కిల్ లో 12 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయబడ్డాయి.

2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందస్తు ఆఫర్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి బల్దియా ఏప్రిల్ నెల చివరి వరకు “ఎర్లీ బర్డ్ ఆఫర్” ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా ట్యాక్స్ చెల్లించే వారికి 5 శాతం డిస్కౌంట్ కల్పించబడుతుంది.

Harish Rao : రైతు భరోసా అమలుపై హరీష్ రావు ఆగ్రహం.. రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు