NTV Telugu Site icon

Amrapali: నిబంధనలు పాటించని మాల్స్, మల్టీప్లెక్స్‌లకు నోటీసులు జారీ

Amrapali

Amrapali

GHMC Commissioner Amrapali: నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ కింద రిజిస్టర్ చేసుకుని, మల్టిపుల్ స్క్రీన్ నడిపిస్తున్నట్లు బయటపడిందని తెలిపారు. తనిఖీలలో నిబంధనలను పాటించని మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ అయ్యాయి.

Read Also: Thummala: బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా?

మరోవైపు జీఐఎస్‌ సర్వేలో పౌరుల నుంచి సేకరిస్తున్న భవనాలు, నీటి, విద్యుత్‌బిల్లుల సమాచారం గోప్యంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. ఆధార్‌ నంబర్‌, వ్యక్తిగత వివరాలు సిబ్బంది తీసుకోరని సిబ్బంది అడిగినా ఇవ్వొద్దని నగర ప్రజలకు సూచించారు. ఆస్తుల నిర్వహణ, యుటిలిటీ మ్యాపింగ్‌ కోసం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సర్వేలో భాగంగా డిజిటల్‌ డోర్‌ నంబర్లు కేటాయిస్తున్నామని, దీనికోసం సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జీఐఎస్‌ సర్వే ద్వారా అన్ని ప్రాపర్టీలను జియో ట్యాగ్‌ చేసి ప్రతి ఆస్తికి ఒక ప్రత్యేక సీక్వెన్షియల్‌ నంబర్‌ కేటాయిస్తామని ఆమె తెలిపారు. పలు ప్రాంతాల్లో బుధవారం సర్వే నిర్వహించిన అధికారులు ప్రజలనుంచి వివరాలు సేకరించారు. సర్వేపూర్తిగా యుటిలిటీ మ్యాపింగ్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడుతుందన్నారు