NTV Telugu Site icon

GHMC: దోమల బెడద అధికంగా ఉందా? ఒక్క క్లిక్ చేయండి.. జీహెచ్‌ఎంసీ చూసుకుంటుంది..

Ghmc

Ghmc

గ్రేటర్ వాసులకు ఏ సమస్యనైనా అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లే సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాప్ పేరే మై జీహెచ్ఎంసీ. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రహదారులపై గుంతలు, చెత్త, మురుగు నీటి వ్యవస్థ బాగోలేకపోయినా… ఇలా ఏ సమస్య అయినా ఒక ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలు… ఏ ప్రాంతం నుంచి ఫోటో అప్ లోడ్ అయితే ఆ ప్రాంత అధికారులకు సమస్య చేరుతుంది. వెంటనే సమస్య పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తారు. దీనివల్ల ఎక్కడ సమస్య ఉన్నా ప్రజలే దానిని పరిష్కరించుకోవచ్చు.

READ MORE: Gachibowli Stadium: 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన.. కారణమేంటంటే..?

తాజాగా ఈ మై జీహెచ్ఎంసీ యాప్ లో దోమల ఫాగింగ్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉంచారు. దోమల బెడద ఎక్కువగా ఉన్న ప్రజలు మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చని అధికారుల తెలిపారు. లొకేషన్ ఆధారంగా రిక్వెస్ట్ చేసిన ప్లేస్ కి వెళ్లి బల్దియా సిబ్బంది ఫాగింగ్ చేయనున్నారు. ఒకసారి రిక్వెస్ట్ చేసి… ఫాగింగ్ చేసిన తర్వాత మళ్ళీ వారం రోజుల వరకు ఇంకో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయదని అధికారులు వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం జూబ్లీహిల్స్ సర్కిల్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం నగరం మొత్తం అందుబాటులోకి తెస్తామని అధికారులు వివరించారు.

READ MORE: AP Deputy Speaker: దుర్యోధనుడి వేషధారణలో అదరగొట్టిన డిప్యూటీ స్పీకర్..