Site icon NTV Telugu

Amrapali Kata : గ్రేటర్ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తూ GHMC కమిషనర్ నిర్ణయం

Amrapali Kata

Amrapali Kata

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎలాంటి బ్యానర్లు అంటించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పోస్టర్లు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా.. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించారు కమిషనర్‌ ఆమ్రపాలి. ఒకవేళ పోస్టర్లు వేస్తే మాత్రం జరిమానా విధించాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు.

Agniveers: బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభాగాలలో అగ్నివీరులకు 15 శాతం రిజర్వేషన్లు..

Exit mobile version