GG W vs UPW W: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఉమెన్ (GG) బోణి కొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో యూపీ వారియర్స్ ఉమెన్ (UPW) పై గుజరాత్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ హై-స్కోరింగ్ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే..
Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడమే నా కల.. రాజ్యాంగంపై కీలక వ్యాఖ్యలు..!
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ ఆష్లే గార్డనర్ 41 బంతుల్లో 65 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. ఆమెకు తోడుగా సోఫీ డివైన్ (38), అనుష్క శర్మ (44) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా.. చివర్లో జార్జియా వేర్‌హామ్ కేవలం 10 బంతుల్లోనే 27 పరుగులతో నిలిచి జట్టు స్కోరును 200 దాటించింది. ఇక యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే, డియాండ్రా డాటిన్ తలో వికెట్ తీసుకున్నారు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ చివరి వరకు పోరాడినా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులకు పరిమితమైంది. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్ లో లిచ్‌ఫీల్డ్ హాఫ్ సెంచరీతో గుజరాత్ జెయింట్స్ కు చెమటలు పట్టించింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కేవలం 40 బంతుల్లోనే 78 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేసింది. ఈమెకు తోడుగా కెప్టెన్ మెగ్ లానింగ్ (30) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మరోవైపు టీంఇండియా ప్లేయర్ హర్లీన్ డియోల్ డకౌట్ అయింది. అలాగే కిరణ్ నవగిరె (1), దీప్తి శర్మ (1) త్వరగానే పెవిలియన్ చేరి నిరాశపరిచారు. చివర్లో ఆశా శోభన 10 బంతుల్లో 27 పరుగులు చేసి ఆశలు రేకెత్తించినప్పటికీ, అప్పటికే లక్ష్యం చేయిదాటిపోయింది.
HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్‌లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
దీనితో యూపీ వారియర్స్ ఉమెన్ (UPW) కు 10 పరుగుల ఓటమి తప్పలేదు. ఇక గుజరాత్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ యూపీని ఒత్తిడిలోకి నెట్టారు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించి 2 వికెట్లు తీసింది జార్జియా వేర్‌హామ్. ఇక రేణుకా సింగ్, సోఫీ డివైన్ లు కీలక సమయాల్లో రెండేసి వికెట్లు తీసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొత్తంగా హై-వోల్టేజ్ డ్రామా మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి గుజరాత్ జెయింట్స్ పైచేయి సాధించింది.
End of a high-scoring contest in Navi Mumbai! @Giant_Cricket 🧡 kick-off their #TATAWPL 2026 campaign with a 🔟-run victory over #UPW
Scorecard ▶️ https://t.co/0Vl9vFyTyq#KhelEmotionKa | #UPWvGG pic.twitter.com/TUpevakZ6v
— Women's Premier League (WPL) (@wplt20) January 10, 2026