ఈరోజుల్లో పొయ్యి, స్టవ్ లపై ఎవ్వరు నీటిని కాచుకోవడం లేదు.. దాదాపు అందరు వేడి నీటి కోసం గీజర్ లను వాడుతున్నారు.. అయితే, వీటిని సరిగ్గా వాడకపోతే అవి పేలడం జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పవర్ ఒకేసారి ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి టైమ్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవేంటో తెలుసుకుందాం..
గీజర్లని ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే వేడెక్కుతుంది. దీంతో పేలే చాన్స్ ఉంటుంది. మనలో చాలా మంది గీజర్స్ వేసి మర్చిపోతుంటారు. ఇది గీజర్ వేడెక్కడం, దాని బాయిలర్ ఒత్తిడిని కలిగిస్తుంది. లీకేజ్ అయ్యేలా చేస్తుంది. ఒత్తిడి పెరగడం వల్ల గీజర్ పేలుతుంది. బాయిలర్ లీక్ అయితే పేలినట్లయితే, కరెంట్ షాక్‌తో కూడా పేలుతుంది.. ఇకపోతే ఉప్పు నీటిని సరఫరా చేసే గీజర్స్‌ని ప్రతి రెండేళ్ళకోసారి రీసైజ్ చేయాలి. లేకుంటే షార్ట్ సర్క్యూట్ వచ్చే ప్రమాదం ఉంది. చాలా గీజర్స్‌లో ఆటోమేటిక్ హీట్ సెన్సార్స్ అమర్చబడి ఉంటాయి. ఆటోమేటిక్ సెన్సార్స్ పనిచేయడం ఆగిపోతే కూడా ఇవి పేలిపోతాయి.. అందుకే ఆటోమెటిక్ గీజర్స్ ను తీసుకోవడం మంచిది..
ఇకపోతే ప్రతి ఆరునెలలకు ఒకసారి గీజర్ ను సర్వీస్ చేయించాలి.. సర్వీస్ ఇంజనీర్ ద్వారా మాత్రమే గీజర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. బాత్‌రూమ్ కోసం ఎప్పుడు పెద్ద గీజర్ అంటే 10 నుంచి 35 లీటర్ల గీజర్ ఉండేలా చూసుకోండి.. ఇక చివరగా గీజర్ టెంపరేచర్ ను చూసుకోవాలి.. ఎప్పుడు కూడా 60 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా ఉండేలా చూడండి. నీటిని వేడి చేసేందుకు తక్కువ సమయం పడుతుంది. ఈ టెంపరేచర్‌లో వేడి చేయడం సరికాదు.. గీజర్ ఎక్కువ వేడెక్కకుండా చెక్ చేసుకోవాలి.. ఇవన్నీ తప్పక పాటించాలి లేకుంటే మాత్రం పేలిపోతుంది..