NTV Telugu Site icon

Hockey : హాకీ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న జర్మనీ

Hocky

Hocky

Hockey : 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను జర్మనీ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ప్రపంచకప్‌ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్‌’లో 5–4తో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ నిర్వహించారు. ‘షూటౌట్‌’లో నిర్ణీత ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. షూటౌట్‌లోనూ చెరి మూడు గోల్స్‌ చేయడంతో షూటౌట్‌ను కొనసాగించారు. కొనసాగింపు రెండో ప్రయత్నంలో బెల్జియం ఆటగాడు కోసిన్స్‌ టాంగుయ్‌ గోల్‌ మిస్‌ చేయడంతో జర్మనీ చాంపియన్‌గా అవతరించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ గెలుచుకోవాలనుకున్న బెల్జియం ఆశలు కల్లలు కాగా, జర్మనీ మూడోసారి కప్‌ను ముద్దాడింది.

Read Also: Sharukh Khan: బాల్కనీ కొచ్చిన బాలీవుడ్ బాద్ షా.. ఫ్యాన్స్‎ను చూసి డ్యాన్స్

మ్యాచ్‌ ఆరంభంలోనే బెల్జియం రెండు గోల్స్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వాన్‌ అబుల్‌ ఫ్లోరెంట్‌(9ని), కోసిన్స్‌ టాంగుయ్‌(10ని.) తొలి క్వార్టర్‌లో గోల్స్‌ సాధించారు. రెండో క్వార్టర్‌లో వెలెన్‌ నిక్లాస్‌ 28ని. గోల్‌తో అంతరం తగ్గించాడు. మూడో క్వార్టర్‌లో పీలట్‌ గొంజాలో గోల్‌తో స్కోరు సమమయింది. చివరి క్వార్టర్‌లో జర్మనీకి గ్రాంబుష్‌ మాట్స్‌(47ని), బెల్జియంకు బూన్‌ టామ్‌(58ని.) గోల్స్‌ చేయడంతో మ్యాచ్‌ టై అయింది. అంతకుముందు కాంస్య పతకంకోసం జరిగిన పోరులో నెదర్లాండ్స్‌ 3-1తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

Read Also: Venkatesh: ఒక్క హిట్ తో వచ్చిన అవకాశం.. ఒక్క ప్లాప్ తో పాయే..?