Venkatesh: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి హిట్స్ వస్తాయో.. ఎవరికి ప్లాప్స్ వస్తాయో చెప్పడం కష్టం. అసలు ప్లాప్స్ లేని డైరెక్టర్ ఒక ప్లాప్ అందుకున్నా ముందు ఉన్న సక్సెస్ సినిమాలు గురించి మాట్లాడుకోరు కానీ.. ఆ ప్లాప్ గురించే చర్చిస్తారు. ఆ సినిమా తరువాత వారికి అవకాశాలు కూడా వస్తాయో రావో కూడా చెప్పలేం. ఇక ఒక డైరెక్టర్.. ఒకే ఒక్క సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ హిట్ తో చాలా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తరువాటా ఒక స్టార్ హీరోతో తీసిన సినిమా ప్లాప్ కావడంతో ఉన్న అవకాశాలు కూడా పోయాయని టాక్. అతడు ఎవరో కాదు.. కేవీ అనుదీప్. జాతి రత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్. ఈ సినిమా విజయం తరువాత కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో పాటు వెంకటేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట అనుదీప్ కు.
శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే బై లింగువల్ సినిమా తీసిన అనుదీప్ కు విజయం వరించలేదు. ఈ సినిమా థియేటర్ వద్ద బొక్కా బోర్లాపడింది. ఈ పరాజయంతో వెంకటేష్ తో అనుదీప్ మూవీ క్యాన్సిల్ అయ్యిందని టాక్. ఇప్పటికే అనుదీప్ , సురేష్ బాబుకు కథను వినిపించాడని, అది బాగుగోకపోవడంతో ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇన్నర్ టాక్ అయితే ప్రిన్స్ ప్లాప్ అవ్వడమే అని అంటున్నారు. ఇక ప్రస్తుతం వెంకీ మామ ఆ సినిమాను వదిలేసి.. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శత్వంలో సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. కాగా, అనుదీప్, వెంకీతో సినిమా క్యాన్సిల్ అవ్వడంతో సితార ఎంటర్ టైన్మెంట్స్ లో మరో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.