Site icon NTV Telugu

Dhruva Nakshathram postponed: విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్లీ వాయిదా

New Project (1)

New Project (1)

Dhruva Nakshathram postponed: తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలంటే తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. అతను విక్రమ్‎తో గత ఐదేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన సినిమా ‘ధృవ నక్షత్రం’ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. కానీ, మళ్లీ వాయిదా వేసినట్లు దర్శకుడు గౌతమ్ ఈ రోజు తెల్లవారుజామున ప్రకటించారు. ‘ధృవ నక్షత్రం’ సినిమాని విక్రమ్ తో కొన్నేళ్ల ముందు మొదలెట్టారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా సినిమా షూటింగ్ నత్త నడకన సాగింది. ఒక ఐదేళ్ల పాటు షూటింగ్ జరిగి, ఈరోజు నవంబర్ 24న విడుదలవుతుందని దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రకటించారు. ఇప్పటికైనా సినిమా విడుదలవుతుందని విక్రమ్ అభిమానులు భావించారు. అదీ కాకుండా ఈ సినిమాకి ప్రమోషన్లు కూడా పెద్దగా నిర్వహించలేదు.

Read Also:Maharashtra: ముంబై విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను పేల్చివేస్తామని బెదిరింపు

ఈరోజు విడుదలవ్వాల్సిన ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్ళీ వాయిదా పడింది. స్వయంగా దర్శకుడు, నిర్మాత అయిన గౌతమ్ మీనన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. కానీ ఈరోజు తెల్లవారుజామున గౌతమ్ ఒక ప్రకటన చేస్తూ, “ఈరోజు ‘ధృవ నక్షత్రం’ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాలేకపోయినందుకు క్షమించండి. మాకు ఇంకో ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తాం, మీకు ఈ సినిమా అనుభూతిని మంచి థియేటర్స్ లో చూపిస్తాము,” అనుకుంటూ రాసుకొచ్చాడు.

Read Also:Fukrey 3 : ఓటీటీ లోకి వచ్చేసిన బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ..

ఈ సినిమాకి తమిళంలో ‘ధృవ నచ్చతిరం’ అని పెట్టారు. అయితే ముందుగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఇటీవల ఈ చిత్ర నిర్వాహకులు “ట్రైల్ బ్లేజర్” పేరుతో ఒక చిన్న ప్రోమోను విడుదల చేశారు, అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని కూడా అందరూ అంటున్నారు. ఈ సినిమాలో జాన్‌గా విక్రమ్ నటిస్తున్నాడు. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో విక్రమ్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version