NTV Telugu Site icon

Gautam Gambhir Salary: గౌతమ్ గంభీర్ జీతం ఎంతో తెలుసా?

Gautam Gambhir Salary

Gautam Gambhir Salary

India New Head Coach Gautam Gambhir Salary: భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. గంభీర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా వెల్లడించారు. క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులు అశోక్‌ మల్హోత్రా, జతిన్‌ పరాంజపే, సులక్షణ నాయక్‌లు అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గౌతీని కోచ్‌గా ఎంపిక చేశారు. గంభీర్‌కు భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్‌ పెద్దగా పోటీ ఇవ్వలేదనే చెప్పాలి.

ఈ నెల 27 నుంచి శ్రీలంక గడ్డపై భారత జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. ఈ సిరీస్‌ నుంచి గౌతమ్‌ గంభీర్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. హెడ్ కోచ్‌గా గౌతీ మూడున్నరేళ్లు పదవిలో ఉండనున్నాడు. గంభీర్ పదవీకాలం 1 జూలై 2024 నుండి 31 డిసెంబర్ 2027 వరకు ఉంటుంది. కోచ్‌గా ఏడాదికి రూ.12 కోట్ల కన్నా ఎక్కువ జీతమే గౌతీ అందుకోనున్నాడు. అంతేకాకుండా బీసీసీఐ అందించే ఇతర సౌకర్యాలను కూడా పొందనున్నాడు. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ ఏడాదికి రూ.12 కోట్లు తీసుకున్నాడు. ద్రవిడ్‌ కంటే ఎక్కువగానే గంభీర్‌ తీసుకోనున్నాడు.

Also Read: Gautam Gambhir: ఇక నా లక్ష్యం అదే: గౌతమ్‌ గంభీర్‌

ఐపీఎల్ టోర్నీలో గౌతమ్‌ గంభీర్ ప్రాతినిథ్యం వహించడానికి ఇకపై కుదరదు. కేకేఆర్ మెంటార్ పదవికి కూడా అతడు గుడ్ బై చెప్పేశాడు. ఈ లెక్కలన్నీ ఆలోచించి.. బీసీసీఐని గంభీర్ భారీగా జీతాన్ని డిమాండ్ చేశాడట. అందుకే రాహుల్ ద్రవిడ్‌ కంటే ఎక్కువగానే గౌతీ అందుకోనున్నాడు. సహాయ సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛను తనకే వదిలేయాలని కూడా గంభీర్ డిమాండ్ పెట్టాడట. దీనికి కూడా బీసీసీఐ ఒకే చెప్పిందని తెలుస్తోంది. అసిస్టెంట్‌ కోచ్‌గా ముంబై మాజీ ఆటగాడు అభిషేక్‌ నాయర్‌ను ఎంపిక చేయాలని గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments