Gautam Gambhir: “మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది”.. ఘోర పరాజయం తర్వాత కోహ్లీ, రోహిత్‌పై గంభీర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: న్యూజిలాండ్‌తో మౌంట్ మాంగనుయ్ (Mount Maunganui) వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో టీమిండియా (Team India) ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) బ్యాటర్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 89 పరుగులకే ఆలైట్ కావడంతో ఏకంగా 244 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో కోచ్ గంభీర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ బ్యాటర్లను ఏకిపారేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో (International Cricket) ఏ బౌలర్ వేసే బంతి కూడా ఆడలేనంత ప్రమాదకరంగా ఉండదని, దానిని ఎదుర్కొనే సత్తా బ్యాటర్లకు ఉండాలని కుండబద్దలు కొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంత పెద్ద లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు కనీసం పోరాటం చేస్తారని అందరూ ఆశించారు. కానీ, కివీస్ పేసర్ మాట్ హెన్రీ (Matt Henry) వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఆరంభంలోనే ఎదురైన ఈ షాక్ నుంచి భారత బ్యాటింగ్ ఆర్డర్ కోలుకోలేకపోయింది. ఈ ప్రదర్శనపై గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. “అంతర్జాతీయ క్రికెట్లో అన్-ప్లేయబుల్ (Unplayable) డెలివరీలు ఏవీ ఉండవు. మనం చేయాల్సిందల్లా తొలి 10 ఓవర్ల పాటు క్రీజులో నిలదొక్కుకోవడం. మాట్ హెన్రీ మంచి లెంగ్త్‌లో బౌలింగ్ చేశాడు నిజమే, కానీ మనం దానిని సమర్థంగా ఎదుర్కొని ఉండాల్సింది. కేవలం 90 పరుగుల లోపే ఆలైట్ కావడం నిజంగా ఆందోళన కలిగించే విషయం” అని చెప్పుకొచ్చారు. రాబోయే వరల్డ్ కప్ (World Cup) దృష్ట్యా ఈ రకమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు జట్టు మానసికంగా, టెక్నికల్ పరంగా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
Also Read
- EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
- RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
- Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
- Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
గత మ్యాచ్‌లోని లోపాలను కూడా గంభీర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ డీఎల్ఎస్ (DLS) పద్ధతిలో గెలిచినప్పటికీ, 111 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిందని గుర్తుచేశారు. ఇలా వరుసగా వికెట్లు పడిపోవడం టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారిందని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకుండా తొలి 35-40 పరుగులు చేయడం చాలా ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని, తదుపరి జరిగే ఆఖరి మ్యాచ్‌లో పరిస్థితికి తగినట్లుగా తమ ఆటతీరును మార్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే బ్యాటర్లపై నిప్పులు చెరిగిన గంభీర్.. బౌలర్లను మాత్రం సమర్థించారు. కివీస్ జట్టు 333 పరుగులు చేసినప్పటికీ మన బౌలింగ్ యూనిట్ (Bowling Unit) అంతగా తప్పు పట్టాల్సిన పనిలేదన్నారు. అయితే ఫీల్డింగ్‌లో (Fielding) దారుణమైన తప్పిదాలు చేయడం వల్లే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇన్నింగ్స్ ఆరంభంలో విల్ యంగ్ (Will Young) ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని, కానీ క్యాచ్‌లు జారవిడవడంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆకిబ్ నబీ (Aqib Nabi) బౌలింగ్‌లో అదృష్టం కలిసి రాలేదని, అయినప్పటికీ మన బౌలర్లను చూసి గర్వపడాలని గంభీర్ అన్నారు. ఇక మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు వాబుల్ సీమ్ (Wobble Seam) బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంపై మీడియా అడిగిన ప్రశ్నకు గంభీర్ స్పందిస్తూ.. తాను ఎక్కువగా టెక్నికల్ విషయాల్లోకి వెళ్లనని స్పష్టం చేశారు. బంతి పెద్దగా మూవ్ కాలేదని, సీమ్ కన్నా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడమే బ్యాటర్లను ఇబ్బంది పెట్టిందని అన్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: “మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది”.. ఘోర పరాజయం తర్వాత కోహ్లీ, రోహిత్‌పై గంభీర్ ఫైర్
-
BYD Denza Z9 GT: భారత్‌లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
-
EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!