Gautam Gambhir Likely To Say Good Bye To KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గుడ్ బై చెబుతున్నాడా?.. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతీ ఎంపిక ఖాయం అయినట్లేనా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేకాదు టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్దమే అంటూ గంభీర్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. భారత జట్టుకు కోచ్ కావడాన్ని ఇష్టపడతానని, జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదని గౌతీ పేర్కొన్నారు.
శనివారం అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో గౌతమ్ గంభీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ స్థానంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘నేను భారత జట్టుకు కోచ్‌గా ఉండాలనుకుంటున్నాను. జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. 140 మంది కోట్ల భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే’ అని గంభీర్ చెప్పారు. గౌతీ మాటలను బట్టి చూస్తే.. టీమిండియా కోచ్‌గా రావడం ఖాయంగానే కనిపిస్తోంది.
Also Read: WI vs PNG: పసికూనపై చెమటోడ్చి గెలిచిన వెస్టిండీస్!
టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. హెడ్ కోచ్ పదవీకాలం మూడున్నర సంవత్సరాలు (2024 జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు) ఉంటుంది. నూతన కోచ్ వన్డే ప్రపంచకప్ 2027 వరకు కొనసాగుతాడు. ఈ నేపథ్యంలో కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికైతే.. కేకేఆర్‌కు గంభీర్ గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత హెడ్ కోచ్ ఏ ఫ్రాంచైజీలో భాగం కాకూడదు. 2012, 2014లో గంభీర్ సారథ్యంలో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ 2024నూ కేకేఆర్ టైటిల్ అందుకోవడంలో మెంటార్‌గా గంభీర్‌ది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే.