NTV Telugu Site icon

Gautam Gambhir : కోహ్లి, రోహిత్ లకు గంభీర్ చెక్‌ పెట్టనున్నాడా..?

Taemindia

Taemindia

Gautam Gambhir : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ తర్వాత ప్రధాన కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవి కాలం అయిపోనుంది. దీంతో టీమిండియా కొత్త కోచ్ గా ఎవరు వస్తారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా నుంచి జరుగుతున్న పరిణామాల కొద్ది.. టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఈ పోస్టుకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన విషయాలు వరల్డ్ కప్ తర్వాత అధికార ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. అయితే గౌతమ్ గంభీర్ ఈ కోచ్ పదవిని తీసుకోవడానికి ముందు బీసీసీఐకు కొన్ని కండిషన్స్ ముందు ఉంచాలని దానికి కూడా బిసిసిఐ పచ్చ జెండా ఊపినట్లు వివిధ ఛానల్ ద్వారా సమాచారం అందుతోంది. ఇక గౌతమ్ గంభీర్ ఎలాంటి చర్యలను బిసిసిఐ ముందు ఉంచాడో ఒకసారి చూస్తే..

Meenakshi Chaudhary: స్టార్‌ కమెడియన్‌ హీరోతో జతకట్టబోతున్న మీనాక్షి చౌదరి..!

ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 ఫార్మట్ లలో కోచ్ లతోపాటు సహాయ సిబ్బందిని కూడా ఆయనకు నచ్చిన విధంగా ఉండాలని కోరినట్లు సమాచారం. అలాగే ఒక్కసారి తాను కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టుకు సంబంధించిన ఈ విషయంలో కూడా బీసీసీఐ లేదా బయట నుంచి ఎవరు జోక్యం చేసుకోకూడదని కండిషన్ పెట్టాడట. అలాగే 2025లో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (kohli), రోహిత్ శర్మ (rohith sharma), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ వంటి టాప్ ప్లేయర్లను ఈ టోర్నీలో విజయం సాధించకపోతే గనక వారిని తప్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకూడదని గంభీర్ కోరాడట. దీంతో వీరిని మూడు ఫార్మాట్లు నుంచి తప్పిస్తారా.. లేదంటే., కేవలం వన్డేలవరకే ఈ పరిణామం ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

PM Modi: దేశానికి మంచి బాధ్యతాయుతమైన విపక్షం అవసరం(వీడియో)

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ను దృష్టిలో ఉంచుకొని భారత బెస్ట్ టీంను సిద్ధం చేయాలని సీనియర్ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ.. క్రమంగా యువ ఆటగాళ్లకు కూడా జట్టులో భాగం కలిగించేలా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. ఇక చివరగా 2027 లో జరగబోయే వన్డే ప్రపంచ కప్ ను సాధించడమే తన అసలైన లక్ష్యం అని గౌతమ్ గారు చెప్పాడు. అందుకుగాను ఇప్పుడు నుంచే తగిన ప్రణాళికలు ఉంటాయని ఆయన తెలిపాడు.. కాబట్టి తనకు పూర్తి స్వేచ్ఛ చేయాలని బిసిసిఐను కోరినట్లు సమాచారం.

Show comments