Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. మూడు సార్లు టీ20 ప్రపంచ కప్పు గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్‌పై వస్తున్న విమర్శలకు కళ్లెం పడింది. విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్ అనంతరం కోచ్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు. తాను సోషల్ మీడియాలో వస్తున్న విమర్శకులకు జవాబుదారీ తనంగా ఉండాలనుకోవడం లేదని.. కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న తన 30 మంది ఆటగాళ్లుకు మాత్రమే జవాబుదారీతనంగా ఉంటానన్నారు. ఆటగాళ్లు బాగుంటే కోచ్ బాగుంటాడని, మంచి పేరు వస్తుందని హితవు పలికాడు. ఈ విజయాన్ని మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు అంకితమిచ్చిన గంభీర్.. జట్టును సరైన దారిలో పెట్టినందుకు ద్రావిడ్‌కు, ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందించినందుకు లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన అజిత్ అగార్కర్, జై షాలకూ ధన్యవాదాలు తెలిపారు. సెలక్షన్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న అజిత్ అగార్కర్‌ను గంభీర్ అభినందించారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన టెస్ట్ పరాజయాల తర్వాత తాను చాలా నిరుత్సాహంలో ఉన్నప్పుడు జయ్ షా ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలిపారు.
READ MORE: Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!
ఇక టీమ్ స్పిరీట్ గురించి గంభీర్ మాట్లాడారు. ఓడిపోతామనే భయం వదిలేసి ఆడాలని.. 120 పరుగులకే ఆలౌట్ అయినా పర్వాలేదు కానీ, ధైర్యంగా ఆడి 250 పరుగులు చేయడమే లక్ష్యమన్నారు. వ్యక్తిగత స్కోర్ గురించి ఆలోచించకుండా జట్టు విజయంపై దృష్టి పెట్టాలని క్రీడాకారులకు పిలపునిచ్చారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఎంతగానే ప్రశంసించిన గంభీర్.. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేకేఆర్ నుంచి ఇద్దరి మధ్య మంచి మిత్రత్వం ఏర్పడిందని చెప్పారు. జట్టు గెలవాలన్నదే ఇద్దరి ఉమ్మడి లక్ష్యమని తెలిపారు. ఇక 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పథకం గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
READ MORE: Team India History: నీయవ్వ తగ్గేదేలే.. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సరికొత్త చరిత్ర!