NTV Telugu Site icon

Virat Kohli: పాక్ ఆటగాళ్లను కోహ్లి కౌగిలించుకోవడంపై వివాదం.. గంభీర్ తీవ్ర విమర్శలు

Kohli

Kohli

2023 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో విరాట్ కోహ్లీ పాకిస్థాన్ ఆటగాళ్లతో సరదాగా గడుపుతున్నాడు. విరాట్ కోహ్లీకి పాకిస్థానీ ఆటగాళ్లతో మంచి స్నేహం ఉందని, ఈ రెండు జట్లు ఒకరితో ఒకరు తలపడినప్పుడల్లా ఇలాంటి స్నేహబంధం కనిపిస్తుంటుంది. అయితే విరాట్ కోహ్లి ఈ వైఖరిని కొంతమంది ఇష్టపడటం లేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఆసియా కప్‌లో కామెంటరీ చేస్తున్న గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు.

Read Also: Gautam Gambhir: కోహ్లీ ఫ్యాన్స్ కు మిడిల్ ఫింగర్ చూపించిన గౌతమ్ గంభీర్

మా కాలంలో ప్రత్యర్థి ఆటగాళ్లను కౌగిలించుకోవడం, వారి భుజాలపై చేతులు వేసుకోవడం జరిగేది కాదని గౌతమ్ గంభీర్ అన్నాడు. మ్యాచ్ సమయంలో ఆటగాడి కళ్లలో దూకుడు ఉండాలని తెలిపారు. ఎందుకంటే ఆ సమయంలో మీరు మీ దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. గెలుపు గురించి ఆలోచించాలన్నారు. ఆ సమయంలో మీరు టీమ్ ఇండియా జెర్సీని ధరించడమే కాదు, 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.

Read Also: Harihara Veeramallu : మూవీ రిలీజ్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

అయితే పాకిస్తాన్ ఆటగాళ్లను కౌగిలించుకుని విరాట్ తప్పు చేశాడా అని కొందరు అంటున్నారు. చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లు విరాట్‌ను తమ ఆరాధ్యదైవంగా భావిస్తారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్వయంగా విరాట్ వీడియోలను చూసి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని బాబర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏదేమైనాప్పటికీ గంభీర్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అయితే గౌతం గంభీర్ కామెంట్స్ పై క్రికెట్ అభిమానులు కొందరు మండిపడుతున్నారు.