India Head Coach Role: టీమిండియా కోచ్ పదవి అంటే ‘ముళ్ల కిరీటమే’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Head Coach Role: భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం అంత సులభం కాదని న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ కైల్ మిల్స్ అభిప్రాయపడ్డారు. టీమిండియా కోచ్ పదవి ముళ్ల కిరీటంతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. జట్టు ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోతే ఆటగాళ్లతో పాటు కోచ్‌పైనా తీవ్ర విమర్శలు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టుకు గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2024 జూలైలో బాధ్యతలు చేపట్టిన ఆయన నాయకత్వంలో ఇప్పటి వరకు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ వంటి టోర్నీల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచింగ్ శైలిపై కైల్ మిల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనను.. గంభీర్ నాయకత్వంలో భారత జట్టు ఎలా ముందుకు సాగుతోందని మిల్స్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. గౌతమ్ గంభీర్ మైదానంలో ఎప్పుడూ కఠినమైన ప్రత్యర్థిగా ఉండేవారని తెలిపారు. ఆయన ఉన్నప్పుడు సరదా, వినోదానికి పెద్దగా అవకాశం ఉండేది కాదన్నారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి నాయకుడిగా మారారని గుర్తుచేశారు. గంభీర్ మంచి వ్యూహకర్త అని, అద్భుతమైన ఆటగాడని మిల్స్ ప్రశంసించారు. ఆటలోని ప్రతి అంశంపై ఆయనకు మంచి అవగాహన ఉందని చెప్పారు. అదే సమయంలో క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించే కోచ్ అని పేర్కొన్నారు.
Also Read
- Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
- IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
- Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
- Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం 'రేవంత్ రెడ్డి' చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
ప్రపంచంలోని మరే ఇతర క్రీడా జట్టుకూ భారత క్రికెట్ జట్టుకు ఎదురయ్యే స్థాయిలో విమర్శలు, విశ్లేషణలు ఉండవని మిల్స్ అభిప్రాయపడ్డారు. మాంచెస్టర్ యునైటెడ్, న్యూయార్క్ యాంకీస్, ఆల్ బ్లాక్స్ వంటి ప్రముఖ జట్లకు కూడా సవాళ్లు ఎదురవుతుంటాయని చెప్పారు. అయితే భారత క్రికెట్ జట్టుపై మాత్రం ఎప్పుడు భారీ స్థాయిలో సమీక్షలు, విమర్శలు ఉంటాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు కోచ్‌గా ఉండటం అంత తేలికైన విషయం కాదన్నారు. అయినప్పటికీ గౌతమ్ గంభీర్ ఉత్సాహం, పట్టుదలతో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడే స్వభావం గంభీర్ సొంతమని కైల్ మిల్స్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
India Head Coach Role: టీమిండియా కోచ్ పదవి అంటే ‘ముళ్ల కిరీటమే’..
-
Poker Night Busted : దీపావళి వేళ.. పేకాట ఆడుతూ దొరికిన మహిళా వ్యాపారవేత్తలు..
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
Paytm Diwali Gift Scam: పేటీఎం పేరుతో రూ.1,000 ఎర.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
ట్రెండింగ్
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?