Site icon NTV Telugu

Gas Leak: రసాయన పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌.. అల్లాడుతున్న ప్రజలు..

Gas Leak

Gas Leak

Gas Leak: మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్‌ లోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడం కలకలం సృష్టించింది. నగరం అంతటా రసాయన పొగ వ్యాపించింది. ప్రజలు తమ కళ్లలో మంట, గొంతు నొప్పిని అనుభవిస్తున్నారని సమాచారం. నగరం అంతటా పొగలు వ్యాపించడంతో అక్కడ పట్టపగలే ఏమి కానరాకుండగా పరిస్థితి మారింది. థానే అగ్నిమాపక దళం ప్రకారం, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ప్రజలు కళ్లలో మంట, గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది. అధికారుల ప్రకారం, గురువారం అర్థరాత్రి (సెప్టెంబర్ 12, 2024) అంబర్‌నాథ్‌ లోని ఒక రసాయన కంపెనీలో గ్యాస్ లీకేజీ నమోదైంది. ఈ ఘటన తర్వాత గ్యాస్ ఆ ప్రాంతమంతా వ్యాపించింది.

YSRCP: చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి మార్పు.. మాజీ మంత్రికి కీలక బాధ్యలు..!

అంబర్‌నాథ్ అగ్నిమాపక దళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌నాథ్‌లో ఓ రసాయన కంపెనీ గ్యాస్‌ తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. అంబర్‌నాథ్‌ లోని మోరివలి ఎంఐడీసీలోని ఓ కెమికల్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ అయినట్లు వార్తలు వచ్చినట్లు అధికారులు తెలిపారు . ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయి. గ్యాస్ స్వభావం, లీక్‌కు కారణాన్ని గుర్తించడానికి పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు, మృతి చెందినట్లు సమాచారం లేదు. ఈ ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version