NTV Telugu Site icon

Ganta Srinivasa Rao: రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు స్పందన.. జగన్‌లో భయం, అనుమానం..!

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టిన స్పీకర్‌.. ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు.. అయితే, తన రాజీనామా ఆమోదంపై తొలిసారి స్పందించారు ఘంటా శ్రీనివాసరావు.. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ ఘటనతో సీఎం వైఎస్‌ జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోంది. జగన్‌ది రాజకీయ దివాళాకోరు తనమే. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు నన్ను సంప్రదించకుండానే ఆమోదించారు. గతంలో నేను స్పీకర్‌ను కలిసినప్పుడు ఆమోదించకుండా.. ఇప్పుడు ఆమోదించడమేంటీ..? అని నిలదీశారు.

Read Also: Rukmini Vasanth: సప్త సాగరాలు దాటి టాలీవుడ్’కి వచ్చేస్తోంది.. మొదటి సినిమా ఫిక్స్!

సీఎం జగన్‌లో రాజ్యసభ సీట్ల భయం కన్పిస్తోంది.. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారవి ఆయనకు అనుమానంగా ఉన్నట్టుందన్నారు గంటా శ్రీనివాసరావు.. అయితే, రాజ్యసభ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తా అన్నారు. అరాచకం చేస్తున్న వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో నేను ఓటేయాలనుకున్నా.. కానీ, రాజీనామాతో నన్ను ఓటింగ్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. అయినా, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా నాకున్న మార్గాలేంటి? అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటాను అన్నారు. తాను ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే అని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.