NTV Telugu Site icon

Yarlagadda Venkat Rao: ప్రచారంలో వేగం పెంచిన యార్లగడ్డ వెంకట్రావు

Yarlagadda Venkat Rao

Yarlagadda Venkat Rao

Yarlagadda Venkat Rao: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. బాపులపాడు మండలం కె. సీతారామపురం, కొయ్యూరు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆయా గ్రామాల్లో పర్యటిస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకు అడుగడుగున గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపిస్తూ, మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణంగా టీడీపీ – జనసేన సంయుక్త మేనిఫెస్టో నిలిచిందని తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు స్వర్ణయుగంలా ఉండేదని, ఆనాడు రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ప్రారంభించినా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దన్నగా 43 శాతం పీఆర్సీ అమలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ. 3, 610 కోట్ల భారాన్ని మోయడానికి వెనుకాడకుండా చంద్రబాబు మానవత్వంతో వ్యవహరించారనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచి ఆపద్భాందవుడిగా మారారని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ సారైనా విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో అగ్ర స్ధానంలో నిలిపే దిశగా ఉందని.. దీనిని అమలు చేసే శక్తి, సామర్ధ్యాలు కలిగిన నాయకుడు నారా చంద్రబాబునాయుడని ప్రశంసించారు. పేద ప్రజలకు సేవచేస్తూ, గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలపాలని దృఢమైన సంకల్పంతో ఉన్నానని, ప్రజలందరూ మొదటి ఓటును గాజుగ్లాసు గుర్తుకు వేసి మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్థియైన వల్లభనేని బాలశౌరికి, రెండవ ఓటు సైకిల్ గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో చలమలశెట్టి రమేష్, దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, తూమాటి సాంబశివరావు, కొల్లి సత్యన్నారాయణ, కొల్లి రాంబాబు, వెలగా రాంబాబు, వడ్డీ నాగేశ్వరరావు, చెన్నుబోయిన నాగరాజు, ప్రొద్దుటూరు గంగరాజు, అచ్చన వెంకటేశ్వరరావు, తోట మురళీధర్, చెన్నుబోయిన సాంబశివరావు, చౌటుపల్లి చిరంజీవి, చౌటుపల్లి భాగ్యరాజు, అజయ్, బల్లా జగదీష్, కంచనపల్లి రామారావు, అప్పలరాజు, రామ్ ప్రసాద్, కర్రా ప్రసాద్ పాల్, చంద్రమౌళి, ఎనికేపల్లి రామారావు, ఎనికేపల్లి శ్రీనివాసరావు, చెన్నుబోయిన కామేశ్వరరావు, వంపుగాని చిన్ని, యనమదల సుధాకర్, తుమ్మల ఉదయ్, వడ్లమూడి మూర్తి, తుమ్మల మధు, లావేటి వెంకటేశ్వరరావు , టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.