Site icon NTV Telugu

Ganja Milk Shake: రూటుమార్చిన స్మగ్లర్లు.. కొత్తగా గంజాయి మిల్క్ షేక్..

15

15

తెలుగు రాష్ట్రాలలో రోజు రోజుకి మతపదార్థాలు రవాణా సంబంధించి అనేక కేసులు నమోదవుతున్న విషయం తరచూ వింటూనే ఉన్నాం. మత్తు పదార్థాల్లో ఎక్కువగా తీసుకునే వాటిలో ఒకటైన గంజాయి రోజురోజుకి మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే గంజాయి మహమ్మారి తన రూపాన్ని నిత్యం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటివరకు మనం గంజాయిని కేవలం ఆకుల రూపంలోనే చూసే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు చాక్లెట్లు, పౌడర్ లోకి వచ్చేసాయి. ఇదే క్రమంలోనే గంజాయితో చేసిన మిల్క్ షేక్ లు బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు. అంతకాకుండా కొందరైతే ఏకంగా పిల్లలు తాగే పాలలో ఇది కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అంటూ చెప్పి అమ్ముతుండడం దారుణంగా ఉంది.

Also read: Deccan Chargers Song: నాకు ఇప్పటికీ గుర్తుంది.. బెస్ట్ ఐపీఎల్ థీమ్ సాంగ్ అదే: రోహిత్

అయితే ఇలా చేసింది ఎవరో కాదు ఓ కిరాణా షాపు యజమాని. హైదరాబాదు జగద్గిరిగుట్టలోని ఓ కిరణం షాపులో ఈ సంఘటన చోటు చేసుకుంది. గంజాయికిని అక్రమ రవాణాకు ఎలాగైనా చేయాలని ఉద్దేశంతో రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసులకు పట్టుబడడంతో స్మగ్లర్లు కొత్తగా రూటు మారుస్తున్నారు. ఇప్పటివరకు కేవలం చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్ల రూపంలో వీటిని అమ్ముతుండగా ఇప్పుడు గంజాయిని పౌడర్ రూపంలోకి మార్చేశారు. వీటిని పాలలో కలుపుకొని మిల్క్ షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.

Also read:Teja sajja : ‘మిరాయ్’ గా వస్తున్న తేజ సజ్జా.. మైండ్ బ్లాకయ్యేలా గ్లింప్స్..

ఈ విషయంలో కిరాణా షాప్ యజమాని మాటలు విని మిల్క్ షేక్ తాగిన వారు ఏకంగా ఏడు గంటల పాటు మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం కిరాణా దుకాణంపై దాడి చేసి యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మనోజ్ కుమార్ నుండి నాలుగు కేజీల గంజాయి, అలాగే 160 ప్యాకెట్లు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక వీటిని సప్లై చేసిన మోహన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గంజాయి పౌడర్ ను కిలో రూ. 2500 కు విక్రయిస్తున్నట్లు సదరు దుకాణం యజమాని తెలిపారు. అలాగే గంజాయితో కూడిన చాక్లెట్ ను ఒక్కొక్కటి 40 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version