Deccan Chargers Song: నాకు ఇప్పటికీ గుర్తుంది.. బెస్ట్ ఐపీఎల్ థీమ్ సాంగ్ అదే: రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adam Gilchrist Said Deccan Chargers Team Song best in IPL: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఐపీఎల్ మాజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్‌పై ప్రేమను చాటుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఇప్పటివరకు విన్న థీమ్ సాంగ్‌లలో డెక్కన్ ఛార్జర్స్‌దే బెస్ట్ అని హిట్‌మ్యాన్ తెలిపాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో రోహిత్ ఈ విషయాన్ని తెలిపాడు. ఈ పోడ్‌కాస్ట్‌లో రోహిత్ సహా మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు సహా మరికొందరు పాల్గొన్నారు. ‘క్లబ్ ప్రైరీ ఫైర్’ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ పోడ్‌కాస్ట్‌ను హోస్ట్ చేసింది.
డెక్కన్ ఛార్జర్స్ థీమ్ సాంగ్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్లే చేయగా.. రోహిత్ శర్మ ఎంజాయ్ చేశాడు. అనంతరం రోహిత్ మాట్లాడుతూ… ‘అప్పటి టీమ్ సాంగ్స్ బెస్ట్‌గా ఉండేవి. ప్రస్తుతం అలాంటి టీమ్ సాంగ్స్ లేవు. నేను ఇప్పటివరకు విన్న థీమ్ సాంగ్‌లలో డెక్కన్ ఛార్జర్స్‌దే బెస్ట్’ అని అన్నాడు. డెక్కన్ ఛార్జర్స్ థీమ్ సాంగే ఇప్పటివరకు బెస్ట్ థీమ్ సాంగ్ అని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్ తరఫున గిల్‌క్రిస్ట్, రోహిత్ ఆడిన విషయం తెలిసిందే.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: PBKS vs MI: పంజాబ్‌తో ముంబై ఢీ.. రోహిత్ శర్మకు స్పెషల్ మ్యాచ్!
2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్ కాగా.. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్. 2008లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఛార్జర్స్.. తర్వాతి సీజన్లో టైటిల్ గెలిచి అందరికీ షాక్ ఇచ్చింది. అప్పటి జట్టులో గిల్‌క్రిస్ట్, రోహిత్ సహా ఆండ్రూ సైమండ్స్, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ వంటి దిగ్గజాలు ఉన్నారు. అయితే ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2012లో ఛార్జర్స్ ఫ్రాంఛైజీని ఐపీఎల్ రద్దు చేసింది. అనంతరం హైదరాబాద్ జట్టు హక్కులను సన్ టీవీ నెట్‌వర్క్ దక్కించుకుని.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌గా 2013లో లీగ్‌లో అడుగుపెట్టింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!