NTV Telugu Site icon

Ganja Gang Hulchul: కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి

Ganja Gang

Ganja Gang

Ganja Gang Hulchul: హైదరాబాద్‌లోని కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి పోకిరీలు గంజాయి తాగుతున్నారు. దీంతో కొత్తపేటలోని ఓ కాలనీలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఇంటి ముందు గంజాయి బ్యాచ్‌ ఉంటే అక్కడి నుంచి వెళ్లాలని ఇంటి యజమాని జనార్దన్ నాయుడు చెప్పాడు. ఈ క్రమంలో మమ్మల్ని వెళ్లమంటావా అంటూ జనార్దన్ నాయుడిపై గంజాయి బ్యాచ్ కర్రలతో, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసింది. గంజాయి బ్యాచ్ దాడిలోజనార్దన్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

జనార్ధన్ కుటుంబ సభ్యులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్దన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రతిరోజు కాలనీలో బయటి నుండి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు చెప్పారు. జనార్ధన్ ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్‌ను సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.