NTV Telugu Site icon

Ganja Gang Arrest: తీగ లాగితే క‌దిలిన డొంక‌.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

Ganja

Ganja

Ganja Gang Arrest: గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు స‌భ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండ‌గా గంజాయి వ్యవ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 21.096 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివ‌రాలను జిల్లా ఎస్పీ ఎస్ స‌తీష్ కుమార్‌ వెల్లడించారు. ఏజ‌న్సీ ప్రాంతాల నుండి గంజాయి తెచ్చి ఈ ముఠా విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also: Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్!

ప్రధాన నిందితుడు కొల్లిప‌ర‌కు చెందిన అమ్మిశెట్టి శివ చందుపై గతంలోనే 10 కేసులు నమోదైనట్లు చెప్పారు. బైక్ చోరీలు, ఇళ్లలో దొంగ‌త‌నాల‌కు పాల్పడుతూ నిందితులు గంజాయి విక్రయాలు కూడా చేస్తున్నారు. వీరి వ‌ద్ద నుండి 13గ్రాముల బంగారంతో పాటు బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రానున్న మూడు నెల‌ల్లో గంజాయి పూర్తిగా నిర్మూలిస్తామని ఎస్పీ స‌తీష్ కుమార్‌ తెలిపారు. గంజాయి త‌ర‌లిస్తున్నా, విక్రయిస్తున్నా, సేవిస్తున్నా స‌మాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. జిల్లాలో ఇప్పటికే 12 మందిపై పీడీ యాక్ట్ న‌మోదు చేశామని… త్వర‌లో జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు.

Show comments