గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని 21.096 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.