Site icon NTV Telugu

Ganja: విశాఖలో గంజాయి చాక్లెట్లు కలకలం.. 660 గ్రాములు స్వాధీనం

Ganja

Ganja

విశాఖ నగరంలో గంజాయి గుప్పుమంటోది. గంజాయి గ్యాంగ్ రూటు మార్చి చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు. గతంలో హవారా బ్యాచ్, ఒక వర్గం లక్ష్యంగా ఉండేది. అయితే ఇప్పుడు స్కూల్, కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా చేసుకుని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. చాక్లెట్లు ఇచ్చి వ్యసనంగా మార్చి గంజాయి ముఠా సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా గంజాయి ముఠా అస్సలు పట్టుబడటం లేదు.

IPL 2025: హార్దిక్‌ను విడుదల చేసి.. ఆ ముగ్గురిని ఉంచుకోండి

విశాఖ నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయం కలకలం రేపుతోంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాపులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Grand Celebrations: తెలుగు హీరోయిన్‌కి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు.. గ్రాండ్ సెలబ్రేషన్స్

Exit mobile version