తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి శంఖారావం పూరించారు అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సింహ గర్జన సభతో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచే ప్రారంభించారు.. కేసీఆర్ కు సెంటిమెంట్ కరీంనగర్ జిల్లా అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలతో ఎంతో అనుబంధం ఉంది అని వెల్లడించారు.
Read Also: Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ ప్రేమ నాకొద్దు.. లాలూ హిందూ నిర్వచనాన్ని మరిచిపోయాడు..
రైతుబంధు, దళిత బంధు పథకాలను కరీంనగర్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారు అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలి.. 12వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇదే కరీంనగర్ నుంచి మరోసారి కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు.. కేసీఆర్ అధినేతగా ఉండాలని తెలంగాణ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.