Site icon NTV Telugu

Gangula Kamalakar: దొంగసొమ్ము తీసుకోండి.. కారు గుర్తుకు ఓటేయండి

Gangula

Gangula

బండి సంజయ్ ఎంపీగా ఎన్నికైన అనంతరం కరీంనగర్ అభివృద్దికి కానీ, ఇక్కడి వ్యక్తులకు కానీ కనీసం ఒక్క రూపాయి తెచ్చి సాయం చేసారా అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగుల మాట్లాడుతూ.. అబద్దాలు చెప్పే బండి సంజయ్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా వేల కోట్లతో కరీంనగర్ ను అభివృద్ది చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ పార్టీకి ప్రతినిధిగా ఉండి కూడా కనీసం పని చేయలేని వ్యక్తి బండి సంజయ్ అని గంగుల అన్నారు.

Read Also: Telangana Elections 2023: కాంగ్రెస్‌ కు షాక్.. కారెక్కిన కత్తి కార్తీక..

అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా బండి సంజయ్ పోటీ చేయడానికి ఎలా వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. అసలు నిన్ను మీ పార్టీ నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తీసేసారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజల దగ్గర నుండే సమాధానం మంత్రి రాబట్టారు. కేవలం అవినీతి ఆరోపణలతో కోటాను కోట్లు డబ్బుల సంచులు తీసుకున్నందుకే బండి సంజయ్ పదవిని తీసేయడం జరిగింది.. ఇయ్యాలా ఆ నోట్ల కట్టలతో ఓటుకు 20 వేలైనా వెదజల్లి గెలుస్తా అనే డబ్బు మదంతో పోటీలో దిగాడని మంత్రి గంగుల కమలాకర్ దుయ్యబట్టారు.

Read Also: Anil Ravipudi : రాజకీయ నాయకుడిగా మారిన అనిల్ రావిపూడి.. వైరల్ అవుతున్న వీడియో..

డబ్బులు పారేస్తా అంటున్న బండి సంజయ్ అవినీతి డబ్బుల్ని బరాబర్ ప్రజలు తీసుకోవాలి.. అయినా కారు గుర్తు పైనే ఓటును గుద్దాలి అని మంత్రి గంగులా కమలాకర్ అన్నారు. కార్యకర్తలకు లక్షో రెండు లక్షలో ఇస్తూ చిన్న ముల్లెలు ఇప్పుడు కాదని, బండి సంజయ్ పెద్ద ముళ్లె ఎప్పుడు ఇప్పుతావో చెప్పాలని ఆయన అడిగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతున్నంత సేపు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

Exit mobile version