టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ఆయన తీసిన సినిమాలలో ఎఫ్ 3 సినిమా పరవాలేదు అనిపించుకోగా మిగతా సినిమాలు అన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.ఇక ఈ మధ్య తన కామెడీ మార్క్ పక్కనపెట్టి బాలకృష్ణతో ఎమోషన్స్ తో కూడిన సినిమా భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కించాడు… ఆ చిత్రంతో కూడా అద్భుత విజయం అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఈ దర్శకుడు భగవంత్ కేసరి సినిమా తరువాత తన తరువాత సినిమా పై దృష్టి పెట్టాడు.. తన తరువాత సినిమా మాస్ మహారాజ్ రవితేజతో చేయబోతున్నట్లు గా వార్తలు వచ్చాయి.. ఆఫీషియల్ గా అయితే ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే ఈ దర్శకుడు తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది… ఈ ఊహించని క్లిప్ ఆయన అభిమానులను అర్థం కాని పరిస్థితిలో పడేసింది. అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, అనిల్ రావిపూడి, రాజకీయ నాయకుడి వేషధారణలో కెమెరాను ఉద్దేశించి సీరియస్‌గా ప్రసంగించారు. ఈ వీడియో నెటిజన్లలో గందరగోళాన్ని రేకెత్తించింది. అనిల్ రావిపూడి ఈ వీడియోలో చమత్కారంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.’నేను బాక్సాఫీస్ విజయాన్ని రుచి చూశాను, ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ విజయం కోసం ఎదురుచూస్తున్నాను. నేను కొత్త పార్టీ పెడుతున్నాను. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తాను’ అని అనిల్ రావిపూడి వెల్లడించారు.అయితే ఈ వీడియో షేర్ చేసింది అనిల్ రావిపూడి కాదు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా వారు. దీన్ని బట్టి చూస్తే ఆహా లో అనిల్ రావిపూడి ఏదో ఒక పొలిటికల్ వెబ్ షో గా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. కానీ దాని గురించి పూర్తి వివరాలు మాత్రం అనిల్ అలానే ఆహా వారు గా సీక్రెట్ ఉంచారు. కాబట్టి అసలు ఎందుకు ఈ వీడియో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
https://www.instagram.com/reel/CztQpWCRfBK/?igshid=MzRlODBiNWFlZA==