NTV Telugu Site icon

Gangula Kamalakar : ప్రజలను ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది

Gangula Kamala Kar

Gangula Kamala Kar

కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి కేటీఆర్ సభ ఏర్పాట్లు పౌరసరరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, సీపీ సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ జమ్మికుంటలో మొట్ట మొదటి భహిరంగ సభ అని ఆయన అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల బీఅర్ ఎస్ ఓటమి చెందిందని, మేము ప్రజల తీర్పు శిరసావహిస్తామన్నారు. 2023 ఎన్నికల్లో హుజురాబాద్ లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Asaram Bapu: మరో లైంగిక దాడి కేసులో దోషిగా ఆశారాం బాపు.. రేపు శిక్ష ఖరారు..

ఇందుకోసం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారన్నారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు హుజురాబాద్ నియోజక వర్గం ఎలా ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ది ఎలా ఉందో ప్రజలు గమనించాలని, మొదటి సారి వస్తున్న మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుదామన్నారు. నియోజక వర్గం నుండి సుమారు 50వేల మంది తరలి రానున్నారన్నారు. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని, సభను కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేసి చూపించాలన్నారు.

Also Read : Palla Rajeshwar Reddy : ఇది పార్టీ అంతర్గత వ్యవహారం..