Asaram Bapu: మరో లైంగిక దాడి కేసులో దోషిగా ఆశారాం బాపు.. రేపు శిక్ష ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaram Bapu: ఇప్పటికే అనేక లైంగిక ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్న బాబా ఆశారాం బాపు, మరో కేసులోనూ దోషిగా తేలారు. మంగళవారం శిక్షలు ఖరారు చెయ్యనుంది గుజరాత్ గాంధీనగర్ సెషన్స్ కోర్టు. మోటేరా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం బాపు, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది సూరత్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు. పదేళ్ల కిందట బాధితురాలు చేసిన కంప్లయింట్ పై తాజాగా కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో ఆశారాం బాపును దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో నిందితులైన ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. అహ్మదాబాద్ జిల్లా మోటేరాలోని ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన మహిళా భక్తురాలు ఆరోపించింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
అయితే, పదేళ్ల కిందట ఆమె చేసిన ఫిర్యాదుపై గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.. ఆశారాం బాపును దోషిగా నిర్ధారించింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులు ధ్రువ్‌బెన్, నిర్మల, జస్సీ, మీరాను నిర్దోషులుగా పేర్కొంది కోర్టు.. కాగా, ఆశారాం బాపు ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్నాడు. 2013లో జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆయన తనపై లైంగికదాడికి పాల్పడినట్లు 16 ఏళ్ల బాలిక పోలీసులకు అప్పట్లో ఫిర్మాదు చేయడంతో.. ఆశారాం బాపును పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్‌లో జోధ్‌పూర్‌కు తీసుకొచ్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు 2018లో ఆశారాం బాపును దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. దీంతో నాటి నుంచి ఆయన జోధ్‌పూర్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు.. మరి తాజా కేసులో ఆయనకు కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో రేపు తేలిపోనుంది.
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!