NTV Telugu Site icon

Gangula Kamalakar : కులవృత్తులకు జీవం పొసేందుకే బీసీలకు లక్ష సాయం

Gangula Kamalakar

Gangula Kamalakar

కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి లక్ష సాయం అందజేస్తున్నారని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు.. నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 32 మంది కులవృత్తులకు లక్ష సాయం చెక్కులను అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి చేసుకునే ప్రతి బీసీ కుటుంబం ఆత్మగౌరవం తో బ్రతకాలని అన్నారు… కోకపేటలో విలువైన భూములు.. గత ప్రభుత్వల హయాంలో ఇచ్చే రుణాలకు బ్యాంకు గ్యారంటీ లు అడిగేవారు.. తెలంగాణ ప్రభుత్వం అందజేసే లక్ష సాయానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా అందజేస్తున్నామని వెల్లడించారు. చేతి కుల వృత్తులకు సహాయం చేయాలని ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి లక్ష సాయం. అందజేస్తున్నామని వెల్లడించారు.

Also Read : MMTS Trains : హైదరాబాద్‌వాసులకు అలర్ట్‌.. 22 MMTS రైళ్లు రద్దు

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ప్రతి బీసీ కులానికి హైదరాబాద్ నడిబొడ్డున వేలకోట్ల విలువైన భూములు ఆత్మగౌరవ భవనాలకు కేటాయించామన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న లక్ష సాయంతో ప్రతి లేబరు ఓనర్ కావాలని ఆకాంక్షించారు. ఇది నిరంతర ప్రక్రియని ఎవరు నిరాశ పడకూడదని కోరారు.దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి విడుదలవారీగా సాయం అందిస్తామని స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారులకు సహాయం అందజేయాలనే సంకల్పం తో పగడ్బందీగా దరఖాస్తులు పరిశీలిస్తున్నామని చెప్పారు . ఈ కార్యక్రమం లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Also Read : Ranil Wickremesinghe: యూఎస్ డాలర్‌తో సమానంగా భారత్‌ రూపాయి: శ్రీలంక అధ్యక్షుడు