NTV Telugu Site icon

Warangal : వరంగల్ జిల్లాలో పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు

Thieves In Hyder Guda

Thieves In Hyder Guda

Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా చొరబడింది. పోలీసుల నిఘా తక్కువగా ఉండే అర్ధరాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి గుట్టుగా ఎంటరై అందినకాడికి దోచుక వెళ్తున్నారు.. గత నెల రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి రోజు మూడు నాలు చోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలతో జనం వలిగిపోతుంటే వరంగల్ జిల్లాలోని దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారింది

ఉమ్మడి వరంగల్ జిల్లా దొంగతనాలతో వణికిపోతుంది. గత నెల రోజుల నుంచి ప్రతి రోజు ఏదో ఒకచోట దొంగతనం జరుగుతూనే ఉంది. ఈ దొంగతనాల కారణం అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని పోలీసులు నిర్ధారించారు. వరంగల్ నగరంలో ఉత్తరాది రాష్ట్రాల దొంగలు చేరబడ్డారు. వరుసగా దొంగతనాలు చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. నగరాలు పల్లెలు అని లేకుండా అన్నిచోట్ల దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట కనీస మూడు నాలుగు గ్రామాల్లో దొంగతనాలు జరగడం ప్రజల్ని నిద్రలేకుండా చేస్తుంది. ఇంటికి తాళం వేస్తే చాలు దోపిడీకి గురవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రతిచోట ఏదో ఒక చోట దొంగతనం పరిపాటిగా మారింది. ములుగు మహబూబాబాద్ జనగామ జిల్లాల్లో వరుసగా దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనంతటికీ కారణం ఉత్తర భారతదేశానికి సంబంధించిన దొంగల ముఠాలు వరంగల్ నగరంలో చొరబడ్డాయి అని పోలీసుల విచారణలో తేలింది.

Read Also:Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో బాంబు పేలుడు… ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు

వరంగల్ నగరంలోకి చొరబడ్డ దొంగల ముఠా నగరంలోని అపార్ట్మెంట్లో కలియ తిరుగుతున్నారు. ఇప్పటికే రెండు బైకులను ఎత్తుకెళ్లిన దొంగలు తమ పనిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదో ఒక చోటా దోపిడీ చేసి దోచుకుంటూనే ఉన్నారు.. వరంగల్ లో పరిస్థితి ఎంతకు దిగజారింది అంటే పోలీసులు ఉత్తరాది దొంగలు వరంగల్ నగరంలోకి వచ్చారు.. జాగ్రత్తగా ఉండండి.. ఇంటికి తాళం వేసి ఎటున వెళితే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని ప్రచారం చేసేస్థితికి వచ్చిందంటే వరంగల్ నగరంలో దొంగల బీభత్సం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 15 రోజుల్లో 30 దొంగతనాలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. దీంతో గత వారం రోజుల నుంచి వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల నుంచి పోలీసులు కాలనీవాసులు అప్రమత్తం చేస్తున్నారు. ఉత్తరాది దొంగల ముఠా నగరంలో చొరబడింది. జాగ్రత్తగా ఉండండి అంటూ అప్రమత్తత చేస్తున్నారు. అయిన దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హన్మకొండలోని నిరూప్ నగర్ కి చెందిన బుక్య బీమా నాయక్, బుల్లెట్ భీమన్న ఇంట్లో చోరీ జరిగింది. పది తులాల బంగారం, ఒక కిలో వెండి, 1,50,000 నగదును దొంగలు అపహరించారు. మహబూబాబాద్ జిల్లాలో రేచ్చిపోతున్న దొంగలు…పగలు రాత్రి తేడా లేకుండా ఇంట్లో చొరబడి దోపిడి దిగుతున్నారు. నిన్న కేసముద్రం (మ) ఉప్పరపల్లి గ్రామంలో బుర్ర సంపత్ అనే ఇంట్లో పట్టపగలే తాళాలు పగలగొట్టి ఆరు తులాల బంగారు ఆభరణాలు 6వేల నగదు దోచుకొని వెళ్లారు. ఇది మరవకముందే నేడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నరసింహనగర్ కాలనీలో తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న తులం బంగారం, తులం వెండి , 7000 నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఉత్తర భారతదేశం నుంచి వరంగల్ జిల్లాకి వచ్చిన దొంగల ముఠా సామాన్యుల ఇళ్లలోనే కాదు దేవాలయాన్ని వదలడం లేదు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో అర్ధరాత్రి గర్భగుడి తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు దుండగులు. పూజారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాలను గమనిస్తే గ్రామంలో ఉన్న స్కూలు ఆవరణంలో ఖాళీ హుండీ దొరికింది. డబ్బులను తీసుకొని హుండీ పడేసి వెళ్లారు దొంగలు.

Read Also:Bride Suicide: నాలుగు రోజుల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కూతురు ఆత్మహత్య..

గత నెల రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొంగల భయం మరింత పెరిగింది. ఇంటికి తాళం వేస్తే చాలు రాత్రి దోపిడీ గురవుతుంది. గత 15 రోజులుగా వరుసగా జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు విశ్లేషణ చేసే క్రమంలో ఉత్తరాది దొంగల ముఠా బండారం వెలుగులోకి వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ అపార్ట్మెంట్ లో దుండగులు బైక్ ను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ముందుగా అపార్ట్మెంట్ లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు.. దీంతో అసలు విషయం బయట పడింది. సీసీ ఫుటేజీలో ఐదుగురు దుండగులు, మాస్కులు, ముసుగు కప్పుకొని గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ లోకి అయి గ్రౌండ్ ఫ్లోర్ లో పార్క్ చేసి ఉన్న టీఎస్ 03 ఈడబ్ల్యూ 0437 నెంబర్ కలిగిన హోండా సీబీ షైన్ బైక్ ను ఎత్తుకెళ్లారు. అంతేగాకుండా అపార్ట్మెంట్ లోపలికి ప్రవేశించి, వివిధ ఫ్లోర్ లు కూడా తిరిగారు. వీరిని పూర్తిగా పరిశీలించిన పోలీసులు వాళ్లకి దొరికిన ఆడవాళ్ళతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న దొంగతనాలకు కారణం అంతర్ రాష్ట్ర దొంగల ముఠా కారణమని నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసే పనులు పడ్డారు అదే సమయంలో పోలీస్ ఆఫీసర్లు దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు. ఉమ్మడి వరంగల్ లో ఎంత మంది దొంగలు ముఠా చొరబడిందో వివరాలు సేకరించే పనులు పడుతున్నారు. గత 15 రోజులుగా జరిగిన దొంగతనాల తీరుతనాలను విశ్లేషిస్తున్నారు. క్లూస్ టీం అన్ని ఆధారాలను సేకరిస్తుంది కచ్చితంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ సామాన్యులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు గుర్తు చేస్తున్నారు. విలువైన వస్తువులు బంగారం నగదును ఇళ్లలో పెట్టి వెళ్లొద్దు. ఎటైనా దూర ప్రాంతాలకు వెళ్తే మాత్రం తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లండి.. లేదా ఇంటి పక్క వాళ్ళకి ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి అని చెప్పాలని కోరుతున్నారు.