Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో బాంబు పేలుడు… ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని పిషిన్ జిల్లాలో శనివారం జరిగిన పేలుడులో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా 13 మంది గాయపడ్డారు. సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో పోలీసు అధికారులు, పోస్టులపై నిరంతర దాడుల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) 2022లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటుందని ప్రతిజ్ఞ చేసిన తర్వాత దాడులు పెరిగాయి.
గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమం
పిషిన్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ వకిల్ షెరానీ తెలిపిన వివరాల ప్రకారం, పేలుడులో ఇద్దరు పిల్లలు చనిపోగా, 14 మంది మొదట గాయపడ్డారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అర్బాబ్ కమ్రాన్ జాబితా ప్రకారం, గాయపడిన వారిలో 13 మందిని క్వెట్టా ట్రామా సెంటర్‌కు పంపారు. అక్కడ ఒక మహిళ మరణించింది. గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది, ఇద్దరికి స్వల్ప గాయాలు, ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులు ట్రామా సెంటర్ నుండి డిశ్చార్జ్ అయినట్లు జాబితా పేర్కొంది.
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
మోటార్ సైకిల్‌లో పేలుడు పదార్థం
పిషిన్ సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ముజిబుర్ రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం, గాయపడిన ఇద్దరు పోలీసుల పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు పదార్థాన్ని మోటార్‌సైకిల్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో మూడు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సిటిడి), బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కోసం ఆధారాలు సేకరించినట్లు అధికారి తెలిపారు.
ఖండించిన ప్రధాని షాబాజ్ షరీఫ్
పిషిన్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ ఘటనను ఖండిస్తూ.. చిన్న పిల్లలపై దాడి చేసే పిరికి ఉగ్రవాదులను మనుషులుగా పిలిచే అర్హత లేదని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలని కోరారు.
రోడ్డు పక్కన పేలుళ్లు
నోష్కీ జిల్లాలో రోడ్డు పక్కన జరిగిన పేలుడులో ఇద్దరు పాదచారులు గాయపడిన కొద్ది రోజుల తర్వాత ఈ దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాంటియర్ క్రాప్స్ కాన్వాయ్ వెళుతుండగా ఈ దాడి జరిగింది. గత నెలలో, పిషిన్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) కారణంగా జరిగిన పేలుడులో ముగ్గురు సీటీడీ అధికారులు, ముగ్గురు పాదచారులు గాయపడ్డారు.
సీఐడీ వాహనమే లక్ష్యం
డిపార్ట్‌మెంట్ సిబ్బందిని తీసుకెళ్తున్న సిటిడి వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. అదే రోజు ఇదే విధమైన సంఘటనలో, కెచ్ జిల్లాలోని బులెడా ప్రాంతంలో ఫ్రాంటియర్ కార్ప్స్ సౌత్ క్విక్ రియాక్షన్ ఫోర్స్‌కు చెందిన ఒక సైనికుడు మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు డాన్ నివేదించింది.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..