NTV Telugu Site icon

Srisailam: శ్రీశైలంలో 18 నుంచి 27 వరకు వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు

Sakshi Ganapathi

Sakshi Ganapathi

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈనెల 18 నుండి 27 వరకు వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రత్నగర్భగణపతి, సాక్షిగణపతికి, పంచలోహమూర్తికి వ్రతకల్ప విశేషార్చనలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. ప్రతీరోజు వ్రతకల్ప పూర్వకంగా పూజలు, గణపతిహోమం, రుద్రహోమం జరపనున్నారు. ఈనెల 18 న యాగశాల ప్రవేశంతో వినాయకచవితి నవరాత్రులకు దేవస్థానం శ్రీకారం చుట్టనుంది. ఈనెల 27న పూర్ణాహుతితో గణపతి నవరాత్రి మహోత్సవాలకు ముగింపు పలుకుతారు.

Also Read: Minister Harish Rao: ఆ పార్టీ వాళ్ళు తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ

ఈనెల 18న వినాయక చవితి సందర్భంగా భక్తులకు ఉచితంగా సామూహిక గణపతి పూజ చేసే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించనున్నారు. ఆర్జిత పరోక్ష సేవగా మృత్తికా గణపతి పూజను భక్తులకు దేవస్థానం అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే వినాయకచవితి నవరాత్రి మహోత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Show comments