Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Chaturthi: వాడ వాడలో.. పల్లె పల్లెలో.. ప్రతీ పట్నంలో ఇలా.. ఎక్కడ చూసినా వినాయక చవితి శోభ కనిపిస్తోంది.. ఇక, వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ఆరాధించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. “ఓం గణేశాయ నమః” అంటూ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. గణపతి జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక అని తెలిపారు చంద్రబాబు… ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని చెప్పారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే వినాయక చవితి వేడుకలు ప్రజల్లో సామాజిక స్పృహ, ఐక్యత, సమష్టితత్వ భావనను పెంపొందిస్తాయని అన్నారు.
సంస్కృతి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక
ధార్మిక కార్యక్రమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు… ముఖ్యంగా వాడవాడలా ఏర్పాటు చేసే వినాయక మండపాలు, సామూహికంగా నిర్వహించే చవితి వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని తెలిపారు. వినాయక చవితి వేడుకలు మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఈ పండుగ ప్రజల మధ్య ఐక్యత, సమష్టితత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఏపీ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన
వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని, ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడి పూజలో పాల్గొన్న కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. సోసల్ మీడియా వేదికగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
ఓం గణేశాయ నమః
వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మా నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా… pic.twitter.com/E8kw7evZ5e
— N Chandrababu Naidu (@ncbn) September 14, 2026
తాజావార్తలు
-
BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!