Game Changer : ఆ రెండు సినిమాల మధ్య గ్యాప్ లోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్..?
- మరికొద్దిరోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి
- గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్టేనా ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ గా ఉండటం వల్ల గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ సినిమాలో రాంచరణ్ తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.
Read Also :Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీలో మరో స్టార్ హీరో..?
Also Read
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.రీసెంట్ గా రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ నిర్వహించిన చిత్ర యూనిట్ తాజాగా వైజాగ్ లో ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగుస్తుంది.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు.షూటింగ్ పూర్తి అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను బట్టి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.అయితే ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.ఒక వేళ అప్పుడు కూడా కుదరకపోతే క్రిస్మస్ కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అయితే దాదాపు ఈ మూవీ దీపావళికే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ లో అలాగే అల్లుఅర్జున్ పుష్ప 2 డిసెంబర్ లో వస్తుండగా ఈ రెండు సినిమాల గ్యాప్ లో రాంచరణ్ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!