NTV Telugu Site icon

Game Changer: గేమ్ చేంజర్ రిలీజ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Gamechanger (1)

Gamechanger (1)

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద నుంచి అధికారికంగా ప్రకటించారు. గేమ్ చేంజర్‌ సినిమా ఈ క్రిస్మస్‌కు విడుదల కానుందని నిర్మాత దిల్‌ రాజ్‌ ప్రకటించడం గమనార్హం. అభిమానులు గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌ ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు.. గేమ్‌ చేంజరా.. క్రిస్మస్‌కు కలుద్దామంటూ దిల్‌రాజు సమాధానమిచ్చారు. ఈ ప్రకటన రాగానే అభిమానుల అరుపులు, కేకలతో ఆ వేదికా ప్రాంగణం అదిరిపోయింది. గేమ్ చేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలస భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డైరెక్టర్ శంకర్‌ షూటింగ్‌ త్వరలో పూర్తి కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ టాలివుడ్ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.