NTV Telugu Site icon

Game Changer : “డాకు మహారాజ్” ట్రైలర్ కోసం రంగంలోకి “గేమ్ ఛేంజర్” ఎడిటర్

Daakumaharaaj

Daakumaharaaj

Game Changer : ప్రతేడాది సంక్రాంతి పండుగ సీజన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినీ అభిమానులు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ఊరించి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. గురువారం రిలీజైన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

Read Also:Zelensky: రష్యా నుంచి ఉక్రెయిన్ బందీల విడుదల.. జెలెన్‌ స్కీ ట్వీట్

Read Also:Sydney Test: కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించారు.. బీసీసీఐపై సిద్ధూ సీరియస్

దాంతో పాటు సంక్రాంతికి రానున్న లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “డాకు మహారాజ్”కూడా ఒకటి. అయితే ఈ సినిమా ట్రైలర్ కోసం ఇపుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ కంటే ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చి సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ ట్రైలర్ సహా సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్ రూబెన్ ఇపుడు డాకు మహారాజ్ కోసం రంగంలోకి దిగారు. ప్రస్తుతం ట్రైలర్ కట్ పనుల్లో ఉన్నట్లుగా తెలిపి దర్శకుడు బాబీ తనపై పెట్టుకున్న నమ్మకానికి థాంక్స్ చెప్తూ ట్రైలర్ కట్ సిద్ధం అయ్యిందని కన్ఫర్మ్ చేశారు. మరి డాకు మహారాజ్ ట్రైలర్ అదిరిపోయినట్లుగా కూడా చెబుతున్నారు. మరి ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది.

Show comments