Site icon NTV Telugu

Gam Gam Ganesha: ‘ గం..గం..గణేశా ‘ అంటున్న ఆనంద్‌ దేవర కొండ.. న్యూ మూవీ అప్డేట్..

Gam Gam Ganesha

Gam Gam Ganesha

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవర కొండ బేబీ సినిమాతో భారీ సూపర్ హిట్ కొట్టిన సంగితి తెలిసిందే. ఆనంద్ దేవర కొండ తాజా చిత్రం ‘గం..గం..గణేష్.’ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత, ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం గురించి ఒక క్రేజీ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘గం..గం..గణేష్.’ ఓ యాక్షన్ చిత్రం.

Also Read: Baak : “బాక్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం ఫిక్స్..ఎప్పుడంటే..?

త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన ట్వీట్ చేశారు. మేము చాలా సంవత్సరాలుగా క్రైమ్, కామెడీ కోసం పని చేస్తున్నాము. కాకపోతే ఈ సినిమా మేకింగ్‌ లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి, కానీ వారు చెప్పినట్లు, అంతా బాగానే ముగుస్తుంది. మీరందరూ సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. కామెడీ, డ్రామాను వినూత్నంగా రూపొందించారని తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.

Also Read: CPM Srinivas Rao : 175 శాసనసభ స్థానాలలో పోటీలో 124 మంది సంపన్నులు

మొదటి సింగిల్ గా ‘బృందావానివే’ పాట ప్రమోషన్‌ ను ప్రారంభించినప్పటి నుండి, హీరోహీరోయిన్ల మధ్య సూపర్ ట్రాక్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. మరోవైపు సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో హింట్ ఇచ్చే విధంగా, థ్రిల్ ఇచ్చే సరదా ట్విస్ట్ గా డిజైన్ చేసిన యానిమేషన్ పోస్టర్ వైరల్ అవుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని హై – లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Exit mobile version