Gam Gam Ganesha :రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా “దొరసాని” సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా తరువాత ఆనంద్ వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.అయితే గత ఏడాది రిలీజ్ అయిన “బేబీ” సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “గం గం గణేశా”.నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..
Read Also :Prashanth Neel : ఆ హీరో ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇవ్వనున్న ప్రశాంత్ నీల్..?
ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ ,కరిష్మా హీరోయిన్స్ గా నటిస్తున్నారు,అలాగే ఈ సినిమాలో వెన్నెలకిషోర్,జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ,వంశి కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమా మే 31 గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.క్రైమ్ కామెడీ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.