Gam Gam Ganesha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. “దొరసాని” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ .ఆ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.అయితే గత ఏడాది రిలీజ్ అయిన “బేబీ” సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “గం గం గణేశా”.నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ ,కరిష్మా హీరోయిన్స్ గా నటించారు.
Read Also :Ramcharan : “గేమ్ ఛేంజర్” రిలీజ్ కు ఆ డేట్ పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్..?
అలాగే ఈ సినిమాలో వెన్నెలకిషోర్,జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ,వంశి కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.ఈ సినిమా మే 31 గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు టేకింగ్ అదిరిందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.అలాగే హీరో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ అదరగొట్టాడు. ఈ సినిమాలో వచ్చే కామెడీ సీన్స్ ,ట్విస్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమా ఇప్పటికి మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు రానుంది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.ఈ మూవీ జూన్ 28 లేదా జులై మొదటి వారం లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.