Site icon NTV Telugu

TDP- Janasena- BJP Alliance: చంద్రబాబు నివాసంలో షెకావత్, పవన్.. సీట్ల పంపిణీపై తీవ్ర కసరత్తు..

Tdp Janasena Bjp

Tdp Janasena Bjp

Gajendra Singh Shekawat: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu) నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekawat) బృందంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ప్లానింగ్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఏపీలోని తమ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో గజేంద్ర సింగ్ షెకవత్ సమావేశం అయ్యారు.

Read Also: Liton Das: ఎంఎస్ ధోనీని తలపించిన బంగ్లా కీపర్.. నో-లుక్ రనౌట్ వీడియో వైరల్!

ఇక, పొత్తులో భాగంగా మూడు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ ( TDP- Janasena- BJP Alliance ) పార్టీలు పోటీ చేయనున్న స్థానాలతో పాటు ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో బీజేపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. పొత్తులో భాగంగా బీజేపీ- జనసేన పార్టీలకు కలిపి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్ వస్తుంది. ఇక, మూడు పార్టీల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ భేటీతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఇవాళ లేదా రేపు కొలిక్కివచ్చే అవకాశం ఉంది.

Exit mobile version