Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు, అది వారి కనీస ఆహార భద్రతకు ఒక భరోసా. ప్రభుత్వాలు అందించే రాయితీ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అర్హులైన పేదలకు చేరడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే.. కొన్ని సందర్భాలలో అనర్హులు కూడా ఈ కార్డులను కలిగి ఉండటం వల్ల నిజమైన పేదలకు అన్యాయం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను నిరోధించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటారు.
తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ రేషన్ కార్డు జారీ అయిందంటూ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై స్థానిక తహశీల్దార్ ఝాన్సీరాణి అధికారికంగా స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించారు. సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన సదరు కుటుంబానికి 2018లోనే కుర్తి రావులచెరువు గ్రామం పేరిట ఈ రేషన్ కార్డు మంజూరైనట్లు ఆమె నిర్ధారించారు.
Also Read
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
అయితే.. సదరు కార్డు లబ్ధిదారులు 2018 నుండి ఇప్పటివరకు ఎక్కడా కూడా ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తీసుకోలేదని, ఆ కార్డు పూర్తిగా పెండింగ్‌లోనే ఉండిపోయిందని స్పష్టం చేశారు. సాధారణంగా జిల్లా పౌరసరఫరాల శాఖ (డీఎస్ఓ) నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోని కార్డులను వ్యవస్థ నుంచి తొలగిస్తారు. కానీ సాంకేతిక లోపం వల్ల ఈ కార్డు అలాగే ఉండిపోయింది. పైగా ఈ కుటుంబ సభ్యులు ఎలాంటి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో ఆ కార్డు ఎప్పటి నుంచో నిరుపయోగంగా మారింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే, స్థానిక డీలర్ నుంచి నివేదిక సేకరించి, ఆ అనర్హుల రేషన్ కార్డును శాశ్వతంగా రద్దు చేసినట్లు ఎమ్మార్వో ఝాన్సీరాణి ప్రకటించారు. అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తామని ఆమె పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!