Site icon NTV Telugu

Dil Raju: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానం

Dilraj

Dilraj

జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని నిర్మాత, రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌.డి.సి) దిల్ రాజు తెలిపారు. హెచ్ ఐసీసీ వేదికగా అవార్డులు ప్రదానం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో దిల్‌రాజు ఈ ప్రకటన చేశారు.

READ MORE: Aamir Khen : బాలీవుడ్ నుండి మరో భారీ ప్రజెక్ట్.. అదిరి పోయే అప్ డేట్ ఇచ్చిన ఆమిర్ ఖాన్

కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులకి పరిశ్రమ నుంచి విశేష స్పందన లభించిందని దిల్ రాజు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం నిష్ణాతులతో కూడిన జ్యూరీని నియమించినట్టు ఇటీవల ఆయన వెల్లడించారు. జ్యూరీ ఛైర్మన్, ప్రముఖ నటి జయసుధ అధ్యక్షతన గత బుధవారం(ఏప్రిల్ 17) గద్దర్‌ అవార్డ్స్‌ జ్యూరీ సమావేశం జరిగింది. నామినేషన్ల స్క్రీనింగ్‌ ప్రక్రియ గురించి ఈ సమావేశంలో చర్చించారు.

READ MORE: AP SSC Results 2025: రేపు పదో తరగతి ఫలితాలు విడుదల.. వాట్సప్‌లోనూ రిజల్ట్స్!

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఉమ్మడి రాష్ట్రంలో కూడా రానంత స్పందన గద్దర్‌ చలన చిత్ర పురస్కారాలకి వచ్చింది. అన్ని కేటగిరీలకి కలిపి 1248 నామినేషన్లు అందాయి. తెలుగు చలన చిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించేలా పురస్కారాల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది’’ అన్నారు. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పురస్కారాలు ఇవని, నామినేషన్లని నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యుల్ని ఆయన కోరారు. జ్యూరీ ఛైర్మన్‌ జయసుధ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం అప్పగించిన బాధ్యతని సవాల్‌గా తీసుకుని ఎంపిక ప్రక్రియని పూర్తి చేస్తాం. పురస్కారాల కోసం వ్యక్తిగత విభాగంలో 1172 నామినేషన్లు, ఫీచర్‌ ఫిల్మ్, బాలల చిత్రాలు, పరిచయ చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలతోపాటు ఇతర విభాగాలు కలిపి 76 దరఖాస్తులు వచ్చాయి’’ అని వెల్లడించారు.

Exit mobile version