NTV Telugu Site icon

CM KCR: అధికారిక లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు

Gaddar Last Rites

Gaddar Last Rites

CM KCR: అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గద్దర్ మృతికి సంతాపం ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు సీఎస్ శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also Read: Gaddar Passes Away LIVE UPDATES: అధికారిక లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్రను నిర్వహించనున్నారు. అంతిమయాత్ర మధ్యలో గద్దర్ పార్థీవదేహాన్ని భూదేవినగర్‌లోని ఆయన నివాసంలో కాసేపు సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. రేపు మధ్యాహ్నం వరకు అక్కడే గద్దర్ పార్థీవదేహం ఉండనుంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో భౌతికకాయాన్ని ఉంచారు.

Show comments