Telangana Cabinet Expansion: రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణస్వీకారం..

  • రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
  • మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణం
  • కొత్త మంత్రులను అభినందించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
New Ministers

New Ministers

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ జాప్యానికి తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకత్వం ముగ్గురిని కొత్త మంత్రులుగా ఎంపిక చేసింది. నేడు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగింది. గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వారితో ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు.

Also Read:Telangana Cabinet Expansion: రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులుగా గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ ప్రమాణస్వీకారం..

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం వేళ కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారు అనే చర్చ ఊపందుకుంది. నేటి సాయంత్రానికి మంత్రులకు శాఖల కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం రేవంత్ దగ్గర ఉన్న శాఖల నుంచే కొత్త మంత్రులకు కేటాయింపు చేస్తారని టాక్. సీఎం రేవంత్ దగ్గర కీలక శాఖలు హోం శాఖ, మున్సిపల్ శాఖ.. విద్యాశాఖ.. సంక్షేమ శాఖలు ఉన్నాయి.