NTV Telugu Site icon

Gaddam Aravinda Reddy : మంచిర్యాల టిక్కెటను బీసీలకు కేటాయించాలి

Gaddam Aravinda Reddy

Gaddam Aravinda Reddy

మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి మాట్లాడుతూ.. నిన్న కేటీఆర్ ని కలిసి మంచిర్యాల టిక్కెట్ ను బీసీలకు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. కేటీఆర్ నా ప్రపోజల్ కి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. నా ప్రపోజల్ ని బీఆర్ఎస్ ఒప్పుకోకపోతే బీసీ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గా గెలిస్తే అరాచకాలు ఎక్కువ అవుతాయని ఆయన అన్నారు.

Also Read : Minister Kakani Govardhan Reddy: తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పలేదు.. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే..

అంతేకాకుండా.. గతంలో ఎమ్మెల్సీ గా వున్నప్పుడు అధికారం అండతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చాలా ఇబ్బందుల కు గురి చేశాడని గడ్డం అరవింద్‌ రెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అవినీతి అక్రమాలు ఎన్నో చేశాడని ఆయన మండిపడ్డారు. అనంతరం గోనె ప్రకాష్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే మూడు కోట్ల రూపాయల విలువైన తన 30 గంటల భూమిని విరాళంగా అందిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ జనాభా ప్రాతిపదికన మంచిర్యాల టిక్కెట్ ను అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులకే కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Also Read : Jigarthanda Double X: లారెన్స్ ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు.. జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌ టీజర్‌ చూశారా?

Show comments